top of page

Projects ->Completed -> Ongoing

Completed

Kanchi Paramacharya Vaibhavam books publishing

Volume 1 & 2

Nageswar Mahadev mandir renovation in Badrinarayan Ghat Varanasi

మఠదేవాలయాదీని, గంగాసోపానవంతికా |

కాశ్యాంపవై ప్రకుర్వంతివిత్తశాఠ్య వివర్జితాః

తేషాం పుణ్యం ప్రవక్ష్యామి, సత్యం విశ్వేశభాషితం

స్వర్గాది శివలోకాంతం అనుభూయ చిరం సుఖం

పునరావృత్తి రహితం, మోక్షం యాతి తతస్తతః ||

 

కాశీలోని మఠములు దేవాలయములు గాని, చివరకు గంగలో పడిపోయే మెట్లయిననూ పునరుద్ధరించుటకు శక్తి వంచన లేకుండా ఎవరు సహకరింతురో, వారి పుణ్యము ప్రవర్ధమానమై స్వర్గము నుండి శివలోకము వరకును చిరంతన సుఖములను అనుభవించి, చివరగా జన్మరాహిత్యమగు మోక్షమును పొందుదురని శ్రీ కాశీ విశ్వేశ్వరుని అభయ ప్రదానము.

 

వేలకొలది నూతన దేవాలయ నిర్మాణముల కంటే ఒక్క *పురాతన ఆలయ జీర్ణోద్ధరణ* అనంతమైన పుణ్యఫలములను ఇస్తుంది అనిన పరమాచార్య స్వామివారి ఉపదేశానుసారం, అట్టి అవకాశము మన *కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్టు* తరుపున కాశీఖండోక్త ప్రాచీన *శ్రీ నాగేశ్వర మహాదేవ్* ఆలయ పునరుద్ధరణ చేయుటకు గురువుల అనుగ్రహము లభించినది.

 

ఈ మందిరము పరమపావని అయిన గంగమ్మ ఒడ్డున గల శ్రీ బదరీనారాయణ్/మహథా ఘాట్ లో కలదు. ఇది కాశీఖండమున నరనారాయణేశ్వరుడని, స్థానికంగా నాగేశ్వర మహాదేవుడని ప్రసిద్ధి.

Old Pics – New Pics

 

Panche Sivala Mandir renovation in panchakrosi marg, Varanasi

 

విశ్వనాథుని నగరమైన పంచక్రోశాత్మకమైన వారణాసి మొత్తాన్ని ఒక శివలింగంగా భావించి కాశీ చుట్టూ చేసే ప్రదక్షిణను "పంచ క్రొసీ యాత్ర" అని అంటారు. కాశీ యాత్రలలో ఇది అత్యంత గొప్ప యాత్ర. కాలినడకన అయిదు రోజులపాటు చేసే ఈ యాత్రా మార్గంలో మనకు దాదాపు కొన్ని వందల కాశీ ఖండోక్త, ప్రాచీన, పౌరాణిక శివాలయాలు, దేవీ ఆలయాలు, గణముల ఆలయాలు దర్శనమిస్తాయి.

 

కొన్ని సంవత్సరాలుగా కాశీ యోగిని ఒకరు, జీర్ణమైన అటువంటి ఆలయాలను పునరుద్ధరణ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆలయాలను చేశారు. చెయ్యవలసిన ఆలయాలు ఇంకా వందలలో ఉన్నాయి. అటువంటి పంచక్రోశ మార్గంలో ఉన్న "పాంచే శివాలా" అనే అయిదు ఆలయాల సముదాయాన్ని పునరుద్ధరణ చేసే అవకాశం మనకు కూడా లభించింది.

 

మ్లేచ్చుల దాడులలో ధ్వంసం అయిన ఆలయాలను మన పూర్వికులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి పునరుద్ధరణ చేసుకున్నారు. ఈ ఆలయాన్ని మన ట్రస్ట్ సహాయ సహకారాలతో పునరుద్ధరణ చేశాము

A Goshala is a traditional Indian sanctuary dedicated to the protection and care of cows, which are revered as sacred in Hindu culture. These institutions provide essential services, including shelter for abandoned, old, or stray cattle that can no longer produce milk or work in fields. Beyond basic housing, Goshalas provide nutritious feed, veterinary medical care, and a peaceful environment where animals can live out their natural lives with dignity. Many facilities also function as centers for sustainable agriculture by producing organic fertilizers from cow dung and natural medicines from cow urine. Spiritually, Goshalas offer devotees opportunities for Gau Seva (service to cows), which is believed to bring inner peace and karmic purification. Organizations like ISKCON and various government initiatives support these shelters through donations and infrastructure grants to ensure the welfare of the cattle population.

photo_6089350490367309789_y.jpg (1).jpeg
download (1).jpg
bottom of page